కాటమరాయుడు - కథ కథనం - విశ్లేషణ



కాటమరాయుడు - కథ కథనం - విశ్లేషణ

జనరల్ గా ఒక సినిమాలో కథ వలనో, కథనం వలనో, పాత్ర వలనో, సంఘర్షణ వలనో, కామెడీ వలనో, సందేశం వలనో నచ్చి రీమేక్ చెయ్యటం జరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు హిట్ ఐంది అంటే ఇందులో మేటర్ ఉందిలే అనుకోని కూడా చెయ్యటం జరుగుతుంది. కానీ డబ్బింగ్ అయిన సినిమాని రీమేక్ చెయ్యటం అనేది చాలా సిల్లీ గా అనిపిస్తుంది. పోనీ అదేమన్నా బ్లాక్బస్టర్ - ఇండస్ట్రీ హిట్ అయిన సినిమా అంటే ఏమో, వీరం లాంటి ఒక ఒక సాదా సీదా సినిమా, అది కూడా పండుగ సీజన్లో అవ్వటం వలన, నేటివిటీ వలన, .కేవలం అజిత్ చరిష్మా మీద నడిచిన సినిమా. మాకు కథతో సంబంధం లేదు, మేము ఎం తీసినా చూస్తారు,  చరిష్మా అంటే మా తర్వాతే ఎవడైనా అని అనుకుంటే తప్ప ఇలాంటి సాహసం కి ఎవరు పూనుకోరు, ఒరిజినల్ చూసి సగం అర్ధం అయ్యి సగం అర్ధం కాక పోనీ రీమేక్ కి ఒప్పుకున్నారు అనుకుందాం అనుకునే ఛాన్స్ కూడా లేకుండా చేసి పారేసారు (వీరుడొక్కడే యూట్యూబ్ లో ఉంది గా). ఫస్ట్ లుక్ క్రియేటివిటీ కి జనాలు నవ్వుకున్నారు, ట్రైలర్ అస్ ఇట్ ఈస్ గా ఉంది అని కామెడీ చేసారు, సాంగ్స్ అబ్బే అని తేల్చిపారేశారు, రిలీజ్ కి రెండు రోజులు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయితే మాత్రం ఆశ్చర్య పోయారు. షోస్ మీద షోస్ ఆడ్ అవుతూ ఫుల్స్ అవుతూ "పవర్ స్టార్" క్రేజ్ ని మరొక్కసారి ప్రూవ్ చేస్తుంటే రికార్డ్స్ లెక్కలు సరిచూసుకోటానికి రెడీ అయ్యారు. ఆ తర్వాత ఎం జరిగింది అనేది అందరికి తెలిసిందే కాబట్టి, మనం ఎప్పటిలాగానే వాటి జోలికి పోకుండా కథ కథనం ని విశ్లేషించుకుందాం.

 ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రమే చదవాలని మనవి, తమిళ్ లో చూసినా, తమిళ్ డబ్బింగ్ ని తెలుగు లో చూసినా కూడా చదవొచ్చు సుమీ.

కథ: అనగనగా ఒక అన్నయ్య, అయన చేరదీసిన నలుగురు తమ్ముళ్లు - పెళ్లి పెటాకులు లేకుండా - పంచాయితీలు చేస్తూ సీమలో ఒక ఊరిని ఉద్ధరిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకుంటే తమ్ముళ్లు విడిపోతారు అనే మోడరన్ థాట్స్ ఉన్న అన్నయ్య - బహుశా "మా అన్నయ్య" సినిమా చూసి ఉండకపోవచ్చు - అన్నయ్య కి పెళ్లి చెయ్యకుండా తాము చేసుకోలేం అని, అన్నయ్య కి ముందు పెళ్లి చెయ్యాలి అని ఆలోచించే తమ్ముళ్లు. అయన నిజ స్వరూపం దాచి, ఎదో ఒకటి చేసి, మొత్తం మీద అన్నయ్య ని ప్రేమలో పడేస్తే, ఆ అమ్మాయి కి ఈయన బాట నచ్చక పోతే? ఎం జరిగింది అనేది కథ.

 పైన చెప్పుకున్నది కథ అని మనం అనుకోవాలి, ఎందుకంటే సినిమా మొత్తం వేరే వేరే త్రేడ్స్ మీద మూవ్ అవుతూ ఉంటుంది, ఒక సమస్య తో మొదలై, దానికి ఇంకొక చేదు తోడై, అది అక్కడితో ఆగిపోయి, ఇంకొక సమస్య తో ఇంటర్వెల్ కి వెళ్లి, వేరే కొత్త సమస్య తో సెకండ్ హాఫ్ నిండిపోయిన ఈ కథనం లో వెతుకున్న కథ అయితే ఇదే అనిపించింది మరి.

ఈ కథని మనకి ఎలా చూపించారు?. అంటే కథనం ఎలా ఉంది అని చెప్పుకుంటే, కళ్యాణ్ బాబు సినిమా లో కథ ఏదైతే ఏంటి, అయన ఒక కమర్షియల్ స్టార్, టెంప్లేట్ ఫాలో అయిపోతే చాలు అనుకున్నారో ఏమో, ఒరిజినల్ కి మార్పులు చేసారు, ఆరు పాటలు ఆరు ఫైట్ లు మధ్య లో కామెడీ చాలు అని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉన్నారు.

ప్రారంభం: ఫాన్స్ కోసం, ఫస్ట్ డే ఫస్ట్ షో ఆడియన్స్ కోసం, థియేటర్ లో కోలాహలం కోసం ఒక ఎంట్రన్స్ సీన్, కాటమరాయుడు పరిచయ సన్నివేశం. పవర్ఫుల్ ఎపిసోడ్ తో మొదలు అయిన కథ పాటతో ముందుకి వెళ్తుంది. అప్పటి వరకు అయన గొప్పతనం, మంచితనం, హుందాతనం మనకి పరిచయం అవుతాయి. ఇవన్నీ పవర్ స్టార్ ఇమేజ్ కి అనుగుణం గా చేసుకున్న మార్పులు. ఒక వ్యక్తి ఫస్ట్ సీన్ లోనే ఎంత గొప్పవాడో చెప్పేస్తే, మిగతా సినిమా అతను ఇంకెంత గొప్పవాడో చెప్పాలి, ఎందుకంటే ఒక సారి ఒక ఇమేజ్ ఇచ్చిన తర్వాత అంత కంటే తక్కువ చేస్తే అది జీర్ణించుకోవటం కష్టం. ఇక్కడ అదే జరిగింది. నాయకుడై నడిపించే వాడు అందరి కోసం అడుగేసాడు, మీసం మెలి తిప్పుతాడు జనం కోసం అంటూ ఫస్ట్ సీన్ కి శిఖరం అంచుమీదున్న హీరో కిందకి రావటం తప్ప వేరే దారిలేక పాత్ర చెప్పబడి పోయింది. ఊరికోసం పోరాడిన వాడు రాష్ట్రం కోసం పోరాడాలి తర్వాత దేశం కోసం పోరాడాలి అనుకోవటం ఒక సగటు తెలుగు ప్రేక్షకుడి అంచనా. అక్కడ నుంచి గతి తప్పిన కథ తమ్ముళ్ల ప్రేమాయణం మీదకి వెళ్తుంది తాగుబోతు అన్నయ్య ని పరిచయం చేస్తుంది. ఎంత గొప్ప వాడు అయినా తాగుబోతు తాగుబోతే అవుతాడు, అయన లెజెండ్ లో బాలయ్య లా ఇంట్లో కూర్చొని రాజసం గా గ్లాస్ తిప్పుతూ పెగ్ వెయ్యడు, తాగుతాడు, తాగి గోల చేస్తాడు. కామెడీ పేరుతో క్యారెక్టర్ కి కించపరుస్తుంది. ఆలా అని థియేటర్ లో కూర్చున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండానే ముందుకి నడుస్తుంది. రాజులైన బంటులైన చీకటైతే చుక్క కోసం జివ్వు జివ్వు ఆగునా అంటూ ఫాన్స్ ని ఫ్రంట్ బెంచ్స్ ని గెంతులు వేయించినా ఈ పాత్ర ఎటు పోతుంది అనే దానికి ఒక పరిచయం అందచేశారు ఒకసారి స్టార్టింగ్ క్రెడిట్స్ లో కథ, కథనం లో వచ్చిన అందరి పేర్లు గుర్తు చేసారు. ఒక అమ్మాయి టచ్ కి పడిపోయిన రాయుడు కథ సెకండ్ ఆక్ట్ లో కి ఎప్పుడు వెళ్ళింది అనేది చెప్పటం మాత్రం చాలా కష్టం సుమీ. ఇన్ని రోజుల బ్రహ్మచర్యం ఒక టచ్ లో చలించిపోయిన రాయుడు వ్యక్తిత్వం కి జాలి పడుతూ మనం ముందుకి వెళ్దాం. 

సమస్యాత్మకం: మొదట్లో అవమాన పరిచిన ప్రత్యర్థి పగ ఒకవైపు, ప్రేమలో ఉన్నానో లేదో అనే డైలమా ఒక వైపు తో సెకండ్ ఆక్ట్ లో అడుగు పెట్టిన రాయుడు అవలీలగా ప్రత్యర్థి కి సమాధానం చెప్తూ తనకి తెలియకుండానే ఒక అమ్మాయి కి దగ్గర అవుతాడు. మనసు, ప్రాణం అన్ని లాగెయ్యగా అమ్మాయి ప్రేమలో పడతాడు. మధ్య లో కొంచెం డాన్స్ వేసిన సాంగ్ తో మనల్ని అలరిస్తాడు. అన్ని సవ్యం గా జరుగుతున్నాయి అనుకునే టైం కి, ఇంటర్వెల్ కి ఇంకా టైం ఉంది అని కొంచెం లాగ్ ఇస్తూ అమ్మాయి ని వెళ్ళిపోమంటాడు, మళ్ళీ అంతలోనే తెలుసుకొని ప్రేమని చూపిస్తాడు, ఈ బస్సు ఎపిసోడ్ మొత్తం రాయుడు ప్రేమని మనకి చెపుదాం అనుకునే ఆలోచన లో వ్రాసుకొని ఉంటారు. ఎప్పుడుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైన్ సీన్ తో ఇంటర్వెల్ కి రంగం సిద్ధం అవుతుంది. అప్పటికే ప్రేమలో మునిగిపోయిన రాయుడు తమ్ముళ్లు ప్రేమ కూడా తెలుసుకొని సంతోష పడతాడు. ఇంతలో ఒరిజినల్ లో అజిత్ డూప్ లేకుండా చేసిన ఫైట్ ని సెట్ లో సునాయాసం గా చేసిన రాయుడు బోలెడు డైలాగ్స్ మధ్య ఇంటర్వెల్ కార్డు వేసుకుంటాడు. అసలు అప్పటి వరకు ఉన్న ఆశలు అడియాసలు అయిన సందర్భం కూడా ఇదే. ఇక్కడ ఇంటర్వెల్ ని ప్లాన్ చేసిన విధం తో ఇంకో పావు గంట బ్రేక్ తర్వాత జరగబోయే గంటంపావు సినిమా మన ముందు కనిపించేలా చేస్తుంది. అదే ఒరిజినల్ లో స్మూత్ ట్రాన్సిషన్ ఉంటుంది. ఒరిజినల్ లో ఫస్ట్ హాఫ్ మొత్తానికి ట్రైన్ సీన్ హైలైట్ అయ్యి ఇంటర్వెల్ పండటానికి కారణం తెలుసుకోవాలి అంటే ఒక సారి యూట్యూబ్ ని సెర్చ్ చెయ్యండి. ఎం జరుగుతుంది అనే సస్పెన్స్ మైన్టైన్ చేస్తూ సెకండ్ హాఫ్ లో కి వెళ్లిన ఒరిజినల్ కి ఎం జరగబోతుందో - ఒరిజినల్ చూడక పోయినా - తెలిసిపోయే మన సినిమా కి ఉన్న తేడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని ఒంటి చేత్తో మోసేసాడు రాయుడు. అక్కడక్కడా చలాకీగా కనిపిస్తూ, ఫాన్స్ ని అలరిస్తూ, అలుపు సొలుపూ తెలియకుండా ఫస్ట్ హాఫ్ వరకు అయితే మాత్రం లాగేసాడు. ఫైట్స్ అండ్ సాంగ్స్ అంటూ ఫస్ట్ హాఫ్ వరకు నెట్టుకొచ్చేసారు

కాన్ఫ్లిక్ట్ లేని ఇంటర్వెల్ తర్వాత తెలిసిన రూట్ లోనే ముందుకి వెళ్లిన రాయుడు అన్ని వదిలేసి అమ్మాయి ప్రేమ కోసం తన ఇంటి ముందు నిలబడతాడు. మనం ఫస్ట్ సీన్ లో చూసినా సేమ్ రాయుడేనా అని ఆలోచించే వాళ్ళు ఎంత మంది ఉంటారు అనే కంటే, లవ్ ప్రపోసల్ లో పవన్ పెర్ఫార్మన్స్ లో లీనం అయిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. తమ్ముళ్ల సంతోషం కోసం వెళ్లిన అన్నయ్య ఒరిజినల్ లో ఉంటె, తమ్ముళ్లు రెచ్చ గొడితే వచ్చేసిన అన్నయ్య ఇక్కడ ఉంటాడు. తిరునాళ్ల కోసం ఉండమని హీరో ని అడిగే సీన్ ఒరిజినల్ లో ఉంటె, తిరునాళ్ల కోసం ఇక్కడ తిష్ట వేసే సీన్ మనకి దొరికింది. ఇదంతా ఎందుకు అంటే, పాత్ర ని ఎలా ప్రొజెక్ట్ చేసారు అనేది చెప్పే ఉద్దేశం అంతే. 

చేసిన మార్పులు ఒరిజినల్ లో ఉన్న అతి తక్కువ ఫీల్ ని కూడా క్యాచ్ చేయకపోగా ఇష్ఠానుసారం తెలుగీకరించిన విధానం విసుగు పుట్టిస్తుంది. అమ్మాయి కి తప్ప ఆ కుటుంబం లో ఎవ్వరికి రాయుడు మీద ద్వేషం ఉండదు. రాయుడు కూడా ఇంప్రెస్స్ చెయ్యాల్సింది అమ్మాయిని మాత్రమే. రాయుడు నిజస్వరూపం మొత్తం తెలిసిపోయి ఇంక తన ప్రేమకి పచ్చ జెండా దొరికే అవకాశమే లేదు అనుకునే టైం కి అమ్మాయి కోసం అన్ని మానేసిన అన్నయ్య కి ఒక మంచి ఎలేవేషన్ సీన్ పడే అవకాశం స్కూల్ డాకుమెంట్స్ రూపం లో వచ్చింది. ఎప్పుడో ఫస్ట్ లో చూసిన పవర్ఫుల్ సీన్ తర్వాత ఆ రేంజ్ సీన్ ఈ సినిమా లో ఉంటె అది ఇదొక్కటే. చాల సేపు అయ్యింది కాబట్టి ఇక్కడ ఒక సాంగ్ వేసుకోవాలి, సాంగ్ వెయ్యాలి అంటే అమ్మాయి పడిపోవాలి, అమ్మాయి పడిపోతే సినిమా అయిపోతుంది అందుకని ఇక్కడ నుంచి ఇంకో కొత్త థ్రెడ్ మొదలు అయ్యింది. అమ్మాయి ఫామిలీ కి ఒక సమస్య, రాయుడు నాటకం ఇంకా కొనసాగతీయాల్సిన సమస్య. 

అసలు ఫస్ట్ హాఫ్ లో ఉన్న హుషారు కూడా సెకండ్ హాఫ్ లో లేక, సింపుల్ గా ఫైట్స్ తో నింపెయ్యాల్సి వచ్చింది. అసలు ఎక్కడ మొదలు అయిన కథ ఎక్కడికి పోతుంది. జనం కోసం మీసం తిప్పిన నాయకుడు, ఆయుధం పట్టిన శ్రామికుడు, నాయకుడై నడిపించేవాడు సేవకుడై నడుమొంచివాడు అందరికోసం అడుగేసాడు , ఒక టచ్ తో సాంతం లొంగిపోయిన ప్రేమికుడు. అప్పటికి మిగిలిన ఒకే ఒక సమస్య తో ముగింపు బాట పడతాడు.

ముగింపు: ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈ నాదే ఎదురవుతుంటే... అనే రేంజ్ లో ఫోక్ సాంగ్ అయిపోగానే ఇంక సినిమా ఎప్పుడు అయిపోతుందో ఇట్టే పసిగట్టేసిన ప్రేక్షకులకి కూడా కొంచెం ఊపు వస్తుంది. ఫైట్ సెంటిమెంట్ క్లైమాక్స్ ఫైట్ తో సినిమా అయిపోతుంది. అప్పటికే చాలా ఫైట్స్ చూసెయ్యటం వలన ఆ ఫైట్ కూడా సుమారుగానే అనిపిస్తుంది. సినిమాలో అసలైన ట్విస్ట్ అప్పుడే వస్తుంది. ఇదంతా ఎదుకు చేస్తున్నాడో ఒక డైలాగ్ రూపం లో చెప్పినప్పుడు నవ్వాలో ఏడవాలో కూడా అర్ధం కానీ పరిస్థితి ఎదురవుతుంది. ఆ కుటుంబం లో ఒక తండ్రిని తల్లిని కూడా చూసుకున్నాడు రాయుడు అని అప్పుడు చెప్తే కానీ మనకి తెలియదు. 

చివరిగా: టైటిల్ రోల్ లో రాయుడు పాత్ర లో స్టార్టింగ్ లో ఉన్న పవర్ పావు గంటకే కట్ అయిపోగా, కథ లో పాయింట్ లేక, కథనం లో కొత్తదనం లేక, సింపుల్ గా స్టార్ పవర్ మీద బేస్ అయిన వన్ మాన్ షో గా మిగిలిపోయింది. ఫస్ట్ హాఫ్ వరకు నెట్టుకొచ్చేసిన రాయుడు సెకండ్ హాఫ్ కి చతికిలపడిపోయాడు. అస్ ఇట్ ఈస్ గా తీసినా ఇంక అలరించేవాడేమో కానీ, ఈ సారికి ఎప్పటిలాగానే ఫాన్స్ ని అయితే కొంత వరకు అలరించగలిగాడు  కానీ.................. కానీ కానీ కానీ కానీ (రావు రమేష్ స్టైల్ లో) అవును ఇంతకీ ఈ సినిమాలో రావు రమేష్ ఎందుకు ఉన్నట్టు? కానీ కానీ కానీ కానీ.............. ఎక్కువ క్వశ్చన్లు అడిగితే ఇంకో బొగ్గుల కుంపటి రెడీ చేసుకోవాల్సి వస్తుంది ఏమో నేను కూడా.... 

5 comments:

abhimani said...

sir e sari cinema fans ki kuda nachaledu edo teesadu anthey

PRAViews said...

Super..

Anonymous said...

ఒక వ్యక్తి ఫస్ట్ సీన్ లోనే ఎంత గొప్పవాడో చెప్పేస్తే, మిగతా సినిమా అతను ఇంకెంత గొప్పవాడో చెప్పాలి, ఎందుకంటే ఒక సారి ఒక ఇమేజ్ ఇచ్చిన తర్వాత అంత కంటే తక్కువ చేస్తే అది జీర్ణించుకోవటం కష్టం - BANG ON raju garu

Anonymous said...

as usual perfect analysis raju bhai

pavan said...

nenu kuda same to same feel ayyanu sir

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views